Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Full josh: వెంకటేశ్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైలాగ్స్ లేకపోయినా ఒక్క ఎక్స్ ప్రెషన్ తోనే ఆయన నవ్వించేస్తూ ఉంటారు. ‘ఎఫ్ 2’ చూసినవారు ఆయన కామెడీని తలచుకుని ఇప్పటికీ నవ్వుకుంటూనే ఉన్నారు. ఆ సినిమాకి సీక్వెల్ గా ‘ఎఫ్ 3‘ రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. సోనాల్ చౌహాన్ గ్లామర్ .. పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ ఈ సారి ఈ సినిమాకి మరింత ఆకర్షణను .. సందడిని యాడ్ చేయనున్నాయి. ఈ నెల  27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో దిగిపోనుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజా  ఇంటర్వ్యూలో వెంకటేశ్ మాట్లాడుతూ .. ‘ఎఫ్ 3’  కథ వినగానే ‘భలే కాన్సెప్ట్ పట్టాడే అనిపించింది. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది .. కామెడీ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేస్తుందని అనిపించింది. తను చాలా టాలెంటెడ్ .. డైలాగ్స్ బాగా రాస్తాడు. ప్రతి డైలాగ్ లోను ఒక  స్పార్క్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కి ఒక మేనరిజం ఉంటుంది. షూటింగు చాలా  సరదాగా .. సందడిగా సాగిపోయేది. అసలు సెట్లోకి అడుగుపెడుతుండగానే ఒక ఎనర్జీ వచ్చేసేది.

‘ఎఫ్ 3’ కథ అంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతుంది. డబ్బు మనిషిని ఎలా ప్రభావితం చేస్తుంది అనే ఒక అంశం చుట్టూ  ఈ కథ నడుస్తుంది. తెరపై పాత్రలు పడే ఫ్రస్టేషన్ ఆడియన్స్ కి నవ్వు తెప్పిస్తూ ఉంటుంది. ఆర్టిస్టులంతా కూడా చాలా బాగా చేశారు .. ఎవరికీ వారు బెస్ట్ ఇచ్చారు. షూటింగు అయిన తరువాత నేను ఇంటికి వెళ్లి ఆ సీన్స్ ను తలచుకుని నవ్వుకునేవాడిని. ఈ సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరూ నవ్వుకుంటూనే థియేటర్లలో నుంచి బయటికి వస్తారు .. అలాగే ఇంటికి వెళతారు” అని చెప్పుకొచ్చారు.

Also Read : మే 27నుంచి నవ్వులు పూయించనున్న‘ఎఫ్ 3’ 

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com