Wednesday, March 18, 2026
Homeసినిమా‘నాని’ని గుర్తుపట్టని మేనేజర్?

‘నాని’ని గుర్తుపట్టని మేనేజర్?

New Getup:
నాని కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన ‘శ్యామ్ సింగ రాయ్‘. ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికర్తమైన విషయం చెప్పాడు. “ఒక రోజున రాహుల్ నా దగ్గరికి వచ్చి ‘శ్యామ్ సింగ రాయ్’ కథ చెప్పాడు. ఆ కథ వింటున్నంత సేపు, ‘ఆ తరువాత ఏం జరిగింది?’ అంటూ నేను ఆత్రుతగా అడుగుతూనే ఉన్నాను. కథ మొత్తం విన్న తరువాత ఈ సినిమాను తప్పకుండా చేయాలనే నిర్ణయానికి వచ్చాను.

కథ వింటూ నేను పొందిన ఆసక్తిని ప్రేక్షకులు కూడా పొందితే ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం కలిగింది. అందువలన వేరే ఆలోచన లేకుండా ఈ సినిమా చేస్తున్నట్టుగా చెప్పాను. ఈ కథ వింటున్నప్పుడే ఈ పాత్ర లుక్ ఇలా ఉంటే బాగుంటుందే అని నాకు అనిపించింది. చివరికి నేను అనుకున్న లుక్ కి దగ్గరగా ఉన్నదే ఫైనల్ అయింది. ఈ సినిమాలో నేను వాసు – శ్యామ్ సింగ రాయ్ అనే రెండు పాత్రలను పోషించాను. వాసు పాత్రకి సంబంధించిన షెడ్యూల్ పూర్తయిన తరువాత, ఆ రోజు మధ్యాహ్నం నేను కారవాన్ లోకి వెళ్లాను. చకచకా గెడ్డం తీసేసి .. ఒక గంట తరువాత శ్యామ్ సింగ రాయ్ లుక్ తో బయటికి వచ్చాను.

సెట్లో ఎవరి పని వాళ్లు చూసుకుంటున్నారు. ఎవరూ కూడా నన్ను పట్టించుకోవడం లేదు. మా మేనేజర్ కూడా నన్ను చూసి ఎవరో అనుకుని పక్క నుంచి వెళ్లిపోతున్నాడు. అప్పుడు నేను పిలవడంతో, నా లుక్ చూసి ఆశ్చర్యపోయాడు. నన్ను గుర్తుపట్టలేదనీ .. ఈ పాత్రకు నేను కరెక్టుగా సరిపోయానని అన్నాడు. అతను అలా అనడంతో .. ఓకే ఈ లుక్ లో మనం ప్రేక్షకులకు కొత్తగా కనిపించగలం అనిపించింది. లుక్ పరంగా సగం సక్సెస్ అయినట్టేననే ధైర్యం కలిగింది. ఇక సాయిపల్లవి .. కృతి శెట్టి ఇద్దరూ కూడా ఆ పాత్రలకి సరిగ్గా కుదిరారు. అది కూడా ఈ సినిమాకి మరింతగా కలిసొచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు” అని అన్నాడు.

Also Read : ‘శ్యామ్ సింగ‌రాయ్’ తో క్రిస్మస్ మ‌న‌దే : నాని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular