Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

నేచురల్ స్టార్ నాని  లేటెస్ట్ మూవీ ‘దసరా’ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కు ఆదరణ లభించింది. ముఖ్యంగా ధూమ్ ధామ్ పాట మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నానికి జోడిగా కీర్తి సురేష్ కనిపించనుంది.

 శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు. దసరా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com