Sunday, June 14, 2026
Homeసినిమానాని కెరియర్లో ఇది భారీ బడ్జెట్ మూవీ!

నాని కెరియర్లో ఇది భారీ బడ్జెట్ మూవీ!

నాని .. ఎలాంటి సినిమా నేసథ్యం లేకుండా వచ్చి, ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ వెళ్లిన హీరో. ఒక వైపున తన సక్సెస్ రేటును కాపాడుకుంటూనే, మరో వైపున ప్రయోగాలు చేస్తూ వెళుతున్నాడు. కథలను ఎంచుకునే విషయంలో నాని చాలా షార్ప్ గా ఆలోచిస్తాడనే టాక్ ఉంది. దానిని ఆయన నిలబెట్టుకుంటూ రావడం విశేషం. ఆ తరువాత వచ్చిన చాలామంది హీరోలు కథలను ఎంచుకోవడంలో తడబడుతున్నారు. ఆయన మాత్రం నింపాదిగా తన ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు.

కొంతకాలంగా నాని సినిమాలను పరిశీలిస్తే, లుక్ దగ్గర నుంచి ఆయన కేర్ తీసుకోవడం కనిపిస్తుంది. సినిమాకి .. సినిమాకి తాను కొత్తగా కనిపించడం కోసం చేసే ప్రయత్నం కనిపిస్తుంది. ఇక కంటెంట్ విషయంలో కూడా ఆయన సాహసమే చేస్తున్నాడు. అలా ఆయన చేసిన తాజా చిత్రమే ‘సరిపోదా శనివారం’. ఈ నెల 29వ తేదీన థియేటర్లలో ఈ సినిమా దిగిపోనుంది. ఆయన జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ అలరించనుంది.

వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 150 కోట్లని తెలుస్తోంది. 90 కోట్లలో పూర్తి చేయాలనుకుంటే, బడ్జెట్ పెరుగుతూ వెళ్లిందని అంటున్నారు. ఆ స్థాయిలో ఈ సినిమాలో ఏం చూపించనున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. నాని కెరియర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమాగా చెబుతున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular