శాసన మండలికి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు వాకాడ చిరంజీవి రావు, కంజర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి లు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్ర శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో సాగుతోంది. కదిరి ఆర్డీవో కార్యాలయం సమీపంలో లోకేష్ బస చేసిన ప్రాంతానికి నేటి ఉదయం ముగ్గురు ఎమ్మెల్సీలు చేరుకున్నారు. వారికి శాలువా కప్పి సన్మానించారు లోకేష్. వైసిపి అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన మీరు రియల్ హీరోలు అంటూ లోకేష్ వారిని అభినందించారు. ప్రజాసమస్యలపై మండలిలో గళం వినిపించాలని కోరారు.

Also Read : Graduate MLCs: నూతన ఎమ్మెల్సీలకు ఘనస్వాగతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *