Saturday, November 23, 2024
HomeTrending NewsMission Rayalaseema: సీమ కన్నీళ్లు తుడుస్తా: లోకేష్ భరోసా

Mission Rayalaseema: సీమ కన్నీళ్లు తుడుస్తా: లోకేష్ భరోసా

రాయలసీమలో 49 మెజార్టీ సీట్లు వైఎస్సార్సీపీకి ఇస్తే నాలుగేళ్ళుగా ఈ ప్రాంతానికి ఏం చేశారో ఆలోచించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో సీమలో తమకు తక్కువ సీట్లు వచ్చినా ఈ ప్రాంతాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదని, పారిశ్రామికంగా, విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చేశామని, ఇప్పుడు వైసీపీకి ఇచ్చిన సీట్లు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇస్తే చెప్పింది చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. పాదయాత్రలో సీమ కష్టాలు చూశానని, కన్నీళ్లు తుడుస్తానని భరోసా ఇచ్చారు. అధికారంలోకి రాగానే లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. దీనికోసం భూములు కేటాయించి 16 ఏళ్ళు దాటినా ఇంతవరకూ ఒక్క ఇటుక కూడా వేయలేదని విమర్శించారు. చంద్రబాబు నాడు కియా పరిశ్రమ కోసం భూములు సేకరిస్తే లేనిపోని ఆరోపణలు చేశారని, కానీ ఆ సంస్థ ద్వారా 25 వేల మందికి ఉపాధి దొరికిందని వివరించారు. సీమ పేరు చెప్పగానే మామిడి పళ్ళు, కియా కార్లు గుర్తుకొస్తాయని వ్యాఖ్యానించారు. కడపలో జరిగిన బహిరంగసభలో సీమ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్రణాళిక ‘మిషన్ రాయలసీమ’ను ఆయన ప్రకటించారు. సీమలో టిడిపిని ఆదరిస్తే ఈ మిషన్ ను పూర్తి చేసే బాధ్యత తాను వ్యక్తిగతంగా తీసుకుంటానని వెల్లడించారు.

మిషన్ రాయలసీమలో లోకేష్ ఇచ్చిన హామీల్లో ముఖ్యాంశాలు:

  • స్పోర్ట్స్ క్యాపిటల్ అఫ్ ఇండియా గా రాయలసీమ
  • రాయలసీమలో స్పోర్ట్స్ యూనివర్సిటీ
  • అంతర్జాతీయ పోటీలకు క్రీడాకారులను పంపడమే లక్ష్యం
  • అన్ని రకాల క్రీడలకు స్టేట్ అఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీలు, స్టేడియాలు
  • రాయలసీమను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం
  • టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, టైగెర్ ఎకో టూరిజం అభివృద్ధి… తద్వారా గిరిజనులు, చెంచులకు ఉపాధి అవకాశాలు
  • సీమ జిల్లాలను ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్ కంపెనీలకు చిరునామాగా మారుస్తాం
  • బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ కారిడార్ల ద్వారా పారిశ్రామిక అభివృద్ధి

  • మైనింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం
  • టమోటా తుది ఉత్పత్తి వరకూ పూర్తి వాల్యూ చైన్ఏర్పాటు
  • టమోటా రైతులకు  పెట్టుబడులు తగ్గించి గిట్టుబాటు ధర కల్పిస్తాం
  • వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తాం
  • పశువుల కొనుగోలు దగ్గర నుంచి.. మేత, మందుల వరకూ అన్నీ సబ్సిడీలతో అందిస్తాం
  • గోకులాలు ఏర్పాటు చేస్తాం- గొర్రెలు, మేకల పెంపకం కోసం ప్రత్యేక సాయం
  • 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్
  • మామిడి, బొప్పాయి, దానిమ్మ, చీనీ, అరటి పంటలకు ప్రోత్సాహం
  • హార్టీ కల్చర్ పంటలకు ప్రత్యేక యూనివర్సిటీలు
  • సీమలో రైతు బజార్ల సంఖ్య పెంచుతాం
  • కౌలు రైతులను గుర్తించి సాయం చేస్తాం

RELATED ARTICLES

Most Popular

న్యూస్