Monday, June 15, 2026
Homeసినిమా'ఇంటింటి రామాయణం' ట్రైలర్ రిలీజ్!

‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ రిలీజ్!

‘ఇంటింటి రామాయణం’ సినిమా ట్రైలర్ ను హీరో సిద్ధూ జొన్నలగడ్డ రిలీజ్ చేశారు.మా ఇంటికి ఒక కథ అలాంటి ఒక కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానే ‘ఇంటింటి రామాయణం’. సురేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ – నవ్య స్వామి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టైటిల్ ను బట్టే ఇది కామెడీని .. ఎమోషన్స్ ను కలుపుకుంటూ నడిచే కథ అనే విషయం అర్థమవుతోంది. మదీన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ – ప్రసాద్ ఐమ్యాక్స్ నిర్వహించారు.లవ్ … కామెడీ సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. వెంకట్ – గోపీచంద్ నిర్మించిన ఈ సినిమాలో .. నరేశ్ .. గంగవ్వ .. బిత్తిరి సత్తి .. ముఖ్యమైన పాత్రలను పోషించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular