Sunday, June 14, 2026
HomeTrending NewsNo Pre-poll: ముందస్తు లేదు : స్పష్టం చేసిన జగన్

No Pre-poll: ముందస్తు లేదు : స్పష్టం చేసిన జగన్

రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తు ఎన్నికల వార్తలు కేవలం ఊహాగానాలేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. నేడు కేబినెట్ భేటీ అనంతరం అధికారులు బైటకు వెళ్ళిన తరువాత సిఎం కాసేపు మంత్రులతో ఇష్టా గోష్టి మాట్లాడారు. ఈ సందర్భం ఎన్నికల ప్రస్తావన వచ్చింది. ఇంకా ఎన్నికలకు తొమ్మిది నెలల సమయం ఉందని, అందరం ఈ తొమ్మిది నెలలూ కష్టపడి పనిచేస్తే తప్పకుండా విజయం సాధిస్తామని అన్నారు.

కాగా, చంద్రబాబు ఇటీవల విడుదల చేసిన తొలివిడత మేనిఫెస్టోపై కూడా జగన్ స్పందించారని సమాచారం. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేలిగ్గా తీసుకున్నట్లు అభిజ్ఞ వర్గాలభోగట్టా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular