Sunday, January 19, 2025
HomeTrending Newsముందుచూపు లేకనే... : లోకేష్ విమర్శ

ముందుచూపు లేకనే… : లోకేష్ విమర్శ

We will fight: చంద్రబాబు హయాంలో ప్రవేశ పెట్టిన విద్యుత్ సంస్కరణలు అమలు చేసి ఉంటే ఈరోజు విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఉండేది కాదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు.  విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తాడేపల్లిలోని తన నివాసం నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి లాంతరు చేతబట్టుకొని వచ్చి నిరసన తెలియజేయజేశారు. నాడు సోలార్ పవర్ కొనుగోలు కోసం బాబు హయాంలో ఎంవోయూలు కుదుర్చుకున్నామని, జగన్ అధికారంలోకి రాగానే ఒప్పందాలు రద్దు చేశారని, వాటిని కొనసాగించి ఉంటే ఇప్పుడు యూనిట్ కు ఒక రూపాయి ఛార్జీ తగ్గించేందుకు కూడా అవకాశం ఉండేదని వ్యాఖ్యానించారు. దాదాపు 10 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలుకు బాబు ప్రణాళికలు రూపొందించారని గుర్తు చేశారు. ఏదో జరిగిపోయిందంటూ నాటి ఒప్పందాలు రద్దు చేయడం వల్లే ఇప్పుడు ఆంధ్ర్రప్రదేశ్ అంధకారంగా మారిందన్నారు.

ఈ ప్రభుత్వ చేతగానితనం, ముందుచూపు లేకపోవడంవల్ల బహిరంగ మార్కెట్ లో యూనిట్ 9 రూపాయలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొని ఉందని లోకేష్ విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్రంలో ఏ ప్రాంతంలో నైనా, ఆఖరికి పులివెందులలో ఏ వార్డులో నైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని, తన సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ విసిరారు. బాబు హయాంలో ప్రతి ఉగాదికి చంద్రన్న కానుకు ఇచ్చేవాళ్ళమని, కానీ జగన్ ప్రభుత్వం ప్రజలకు ఉగాది కానుకగా విద్యుత్ ఛార్జీల పెంపును ఇచ్చిందని మండిపడ్డారు.

గత ఐదేళ్ళ కాలంలో ఏనాడూ విద్యుత్ ఛార్జీలు పెంచలేదని,  కానీ ఇప్పుడు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఆన్ చేయాలంటే ప్రజలు భయపడుతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్