ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులు ముగించేందుకు రాజీ దిశగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ లోని డినిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని సైనిక స్థావరంపై రష్యా బలగాలు దాడి చేశాయి. సైనిక స్థావరంపై రష్యా క్షిపణుల దాడులతో తీవ్ర నష్టం వాటిల్లింది. గత 24 గంటల్లో ఈశాన్య ప్రాంతంలోని ఖర్కివ్ లో ఫిరంగులు గర్జించాయి. అటు అంతర్జాతీయ శాంతి ఒప్పందానికి ఇరు దేశాలు మొగ్గుచూపాయి.

అయితే చర్చల ద్వారా పాజిటివ్ సంకేతాలు వస్తున్నా.. రష్యాను పూర్తిగా నమ్మలేమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్, చెర్నిహైవ్ సమీపంలో సైనిక కార్యకలాపాలను తగ్గించుకునేందుకు రష్యా చర్చల్లో అంగీకరించింది. ఇది పూర్తిగా ఉక్రెయిన్ సైనికుల వల్లే సాధ్యపడిందని జెలెన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్ సైనికుల ధైర్యవంతమైన చర్యల వల్లే రష్యా వెనక్కి తగ్గిందన్నారు. రాజీ అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ  నిర్లక్ష్యంగా ఉండొద్దని, పరిస్థితులు ఇంకా పూర్తిగా మెరుగు పడలేదని అన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగించే అవకాశాలున్నాయని, ఉక్రెయినియన్లు ప్రతిఘటనను కొనసాగించాలని జెలెన్ స్కీ పిలుపునిచ్చారు. దేశ సౌభ్రాతృత్వం, భౌగోళిక సమగ్రతపై ఉక్రెయిన్  ప్రతినిధులు ఎప్పటికీ రాజీ పడబోరని ఆయన స్పష్టం చేశారు.

రష్యా ప్రకటనపై బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాల ప్రెసిడెంట్లతో మాట్లాడతానని అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్​ చెప్పారు. రష్యా ప్రకటనతో యురప్​ స్టాక్​ మార్కెట్లు కొద్దిగా కోలుకున్నాయి. నూనె ధరలు ఐదు శాతానికి పైగా దిగొచ్చాయి. డాలర్​తో రూబుల్​ మారక విలువ 10 శాతం తగ్గింది.

Also Read : ఉక్రెయిన్ పతనం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *