Tuesday, July 9, 2024
HomeTrending NewsNara Lokesh: ఫలించిన నిరీక్షణ - అమిత్ షా తో భేటీ

Nara Lokesh: ఫలించిన నిరీక్షణ – అమిత్ షా తో భేటీ

ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎదురు చూపులు ఫలించాయి. తన పెద్దమ్మ, బిజెపి రాష్ట్ర  అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చొరవతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ఆయన కలుసుకోగాలిగారు. నిన్నరాత్రి ఈ భేటీ జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ సిఐడి విచారణకు హాజరైన లోకేష్ ఆ వెంటనే ఢిల్లీ బయల్దేరి వెళ్ళారు. అమిత్ షా తో భేటీ విషయాన్ని చివరివరకూ గోప్యంగా ఉంచారు. రాత్రి 11 గంటల తరువాతే ఈ వివరాలు బైటకు పొక్కాయి.

ఏపీ సిఎం జగన్ కక్ష సాధింపు చర్యలను, బాబును అరెస్టు చేసిన విధానాన్ని కేంద్ర హోం మంత్రి దృష్టికి లోకేష్ తీసుకు వెళ్ళారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి లను కూడా ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో లోకేష్ తో పాటు తెలంగాణా బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరి కూడా పాల్గొనడం విశేషం. కేసుల పేరుతో బాబును ఇబ్బంది పెట్టడం సరికాదని అమిత్ షా అభిప్రాయపడ్డారని, బాబు ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారని టిడిపి వర్గాలు వెల్లడించాయి.

ఈ భేటీపై పురందేశ్వరి ట్వీట్ చేశారు.  రాష్ట్రంలోని విపక్ష నేతలపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఈ విషయాన్ని లోకేష్ కూలంకుషంగా కేంద్ర హోం మంత్రికి వివరించారని, బాబు అరెస్టు వెనుక బిజెపి ఉందని విమర్శలు చేసే వారికి నేటి మీటింగ్  ఓ గట్టి సమాధానం చెప్పిందని, ఒకవేళ నిజంగా బిజెపి ఉండి ఉంటే లోకేష్ ను అమిత్ షా ఎందుకు కలుస్తారని ఆమె ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్