Saturday, March 7, 2026
HomeTrending Newsలోకేష్ శవ రాజకీయాలు: గోపిరెడ్డి

లోకేష్ శవ రాజకీయాలు: గోపిరెడ్డి

నారా లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారని, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత డా. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. అనూష ఘటన జరిగి ఏడు నెలలైందని, లోకేష్ కు ఇప్పుడు పరామర్శించాలని గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని, నిందితుడిని 24గంటల్లోపే పోలీసులు అరెస్టు చేశారని వివరించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకుందని, సిఎం జగన్ ప్రకటించిన పరిహారాన్ని మూడోరోజే వారికి అందించామని గోపిరెడ్డి వెల్లడించారు.

అనూష కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు విచారణ పూర్తయ్యిందని, త్వరలోనే ఈ కేసులో ఛార్జ్ షీట్ వేసి కోర్టుకు సమర్పిస్తారని చెప్పారు. ఇప్పుడు ఈ విషయాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని లోకేష్ కు హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular