Friday, March 13, 2026
Homeసినిమా23న వస్తున్న ‘నరసింహపురం’

23న వస్తున్న ‘నరసింహపురం’

గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాలతో కలిసి ‘శ్రీరాజ్ బళ్లా’ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాత శ్రీరాజ్ బళ్లా మాట్లాడుతూ.. “థియేటర్లు ఓపెన్ కావడం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న మేము  “నరసింహపురం” చిత్రాన్ని ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. సెన్సార్ సభ్యులు సహా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన మా టీమ్ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను” అన్నారు.

కల్యాణ మాధవి, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫేమ్ విజయ్ కుమార్, ‘అరవిందసమేత’ ఫేమ్ రంగధామ్, రవివర్మ, సంపత్, ఫణిరాజ్, స్వామి, శ్రీకాంత్, శ్రీకర్, శివ, జునైద్, గిరిధర్, సాయిరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, మేకప్: కె.వి.బాబు, పబ్లిసిటీ డిజైన్స్: వెంకట్.ఎం, విఎఫెక్స్: చందు ఆది, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటింగ్ & డి.ఐ: శివ వై.ప్రసాద్, 5.1 మిక్సింగ్: రమేష్ కామరాజు, పాటలు: గడ్డం వీరు, సంగీతం: ఫ్రాంక్లిన్ సుకుమార్, నిర్మాతలు: శ్రీరాజ్ బళ్ళా- టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular