Sunday, January 19, 2025
Homeసినిమాసరైన నిర్ణయం తీసుకోవాలి : నారాయణ మూర్తి

సరైన నిర్ణయం తీసుకోవాలి : నారాయణ మూర్తి

Narayana Murthy to AP Govt.: న్యాచురల్ స్టార్ నాని హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో  రూపొందిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ వేడుక‌లో ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. మన సౌత్ ఇండియాలో సంక్రాంతి పండగ జరుపుకుంటాం. నార్త్ ఇండియాలో దీపావళి పండగ చేసుకుంటారు ఈస్టర్న్ స్టేట్స్ లో నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటారు. ఇవాళ బెంగాల్ లో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏ బెంగాల్ లో ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయో ఆ ఉత్సవాలను, ఆ గొప్పతనాన్ని, ఆ కలకత్తా కాళీ నాలుక మహోన్నత బీభ‌త్సాన్ని ఈ సినిమా ద్వారా ప్రపంచానికి చూపింది. నవరాత్రి ఉత్సవాలు జరుపుకునేట్టు చేస్తున్నారు. నిర్మాత బోయినపల్లి వెంకట్ గారు ఎంత మంచి వ్యక్తి.

నాని గురించి మాట్లాడుతూ.. ఆయన గురించి నేను ఏమి చెప్పగలంటూ ఆయ‌న‌ ఏడిస్తే.. అయ్యా మీ గ్రాటిట్యూట్, సెంటిమెంట్ కి సెల్యూట్. నిర్మాత అంటే అలా ఉండాలి. అలాగే ఈ చిత్రానికి బ్యాక్ బోన్ గా నిలబడి అమోఘమైన సహాయ సహకారాలు అందించిన దిల్ రాజు గారికి నమస్కారాలు. పాప.. సాయి పల్లవి నిన్ను ఫస్ట్ టైం ఎక్కడ చూశానంటే.. రాజు గారి సినిమా ఫిదాలో చూశాను. హీరోయిన్ లా కాకుండా పక్కంటి పిల్లలా ఉండే అమ్మాయి సాయి పల్లవి. తెలుగు సినిమా ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండాలి. ఆ దశగా ప్రభుత్వం సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నాను అన్నారు.

Also Read : శ్యామ్ సింగ రాయ్ ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ : వెంకట్ బోయనపల్లి

RELATED ARTICLES

Most Popular

న్యూస్