Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Its a Universal Subject:
న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ బోయనపల్లి మీడియాతో చెప్పిన విశేషాలు ఆయ‌న మాటల్లోనే..

శ్యామ్ సింగ రాయ్ ఒక అద్భుతమైన ప్రేమ కథ. సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. డిసెంబర్ 24న మీ ముందుకు రాబోతుంది. నేను 12 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఎన్నో సినిమాలకు బ్యాకెండ్ పని చేశాను. ‘శ్యామ్ సింగ రాయ్’ మేకింగ్ విషయంలో మాత్రం ఏనాడూ ఒత్తిడికి గురి కాలేదు. దానికి కారణం హీరో నాని. ఆయన ఈ కథను నమ్మాడు. ముందు నేను వేరే సినిమా చేయాల్సింది కానీ నాని గారే నన్ను ఈ సినిమా చేయమన్నారు. మొదటి రోజు నుంచి కూడా ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం. గొప్ప సినిమా చేయాలని అందరూ అనుకుంటారు. నానికి ‘జర్సీ’ ఎలాగో నాకు ‘శ్యామ్ సింగరాయ్’ అలాంటి చిత్రం.

Sirivennela Last Song

కరోనా వల్ల కాస్త బడ్జెట్ పెరిగింది. ఆ విషయం మాకు ముందే తెలుసు. కొన్ని సెట్స్ దెబ్బతిన్నాయి. అందుకే బడ్జెట్ పెరిగింది. థియేటర్స్ కౌంట్ తెలీదు కానీ మాకు కావాల్సినన్ని థియేటర్లు ఇచ్చారు. దిల్ రాజు లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్లు మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సినిమా చూస్తే ఖ‌చ్చితంగా 1970 కలకత్తాకు వెళ్తాం. అక్కడి కల్చర్ తెలుస్తుంది. మనం కచ్చితంగా 70వ దశకంలోకి వెళ్లినట్టు ఫీలవుతాం. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తాం. కలకత్తా బ్యాక్ డ్రాప్‌ను చూపించేందుకు భారీ సెట్స్ వేశాం. అంతే కాకుండా కలకత్తాకు 400 కి.మీ దూరంలో ఉన్న ఊర్లో షూట్ చేశాం.

ఇది యూనివర్సల్ మూవీ. తెలుగు వాళ్లకే నచ్చే సినిమా ఏమీ కాదు. బెంగాలీలో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లేదు. దక్షిణాది భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నాం. ఇది హిందీలో రీమేక్ అవుతుందని నమ్మకం ఉంది. అందుకే హిందీలో విడుదల చేయడం లేదు. ఈ కథకు అందరూ కనెక్ట్ అవుతారు. ఇండస్ట్రీలో 12 ఏళ్లుగా ఉన్నాను. ఏడాది క్రితం నిర్మాతగా మారాను. ఓ మూడేళ్ల నుంచి నాని గారితో సినిమా చేయాలని ఎదురుచూస్తూ వచ్చాను. అలా నాకు ఓ స్పెషల్ మూవీ ఆయనతో చేసే అవకాశం వచ్చింది. మళ్లీ శ్యామ్ సింగ రాయ్ లాంటి సినిమాను చేస్తానో కూడా తెలీదు.

2nd Song From Shyam Singha

నాని గారితో సినిమా చేస్తే ఒత్తిడి అనేది ఉండదు. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో నేను భాగస్వామిని. చేస్తే ఇలాంటి హీరోతో సినిమా చేయాలని అనుకున్నాను. మొదటగా నిర్మాత అవ్వాలనే ఆలోచన లేదు. కానీ కృష్ణార్జున యుద్దం చేసే సమయంలో సొంత ప్రొడక్షన్ పెట్టాలని అనుకున్నాను. అది కూడా నాని గారి సినిమాతోనే ప్రారంభించాలని రెండున్నరేళ్లుగా ఎదురుచూశాను. నేను ఈ కథ మొత్తం వినలేదు. నాని గారు విన్నారు. ఓకే చెప్పారు.

రేపు సినిమా విడుదలైతే అందరూ బాగుందని అంటారు. నిహారిక అంటే శ్యామ్ సింగ రాయ్ అని అంటారు. నాని గారి మీదున్న నమ్మకంతోనే బడ్జెట్ గురించి ఆలోచించలేదు. ఆయన కథను నమ్మారు. ఆయన్ను నేను నమ్మాను. నాని గారు డైరెక్టర్‌ను నమ్మారు. నా దృష్టిలో నిర్మాతకు హీరో, దర్శకులంటే ప్రేమ ఉండాలి. వారిపై నమ్మకం ఉండాలి. అలాంటప్పుడే మంచి సినిమా వస్తుందని నేను నమ్ముతాను. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ మేకింగ్ థియేటర్ లో ప్రేక్షకులను తప్పకుండా థ్రిల్ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com