Thursday, June 18, 2026
HomeసినిమాMalli Pelli Review: నరేశ్ మూడో పెళ్లి కథనే 'మళ్లీ పెళ్లి' 

Malli Pelli Review: నరేశ్ మూడో పెళ్లి కథనే ‘మళ్లీ పెళ్లి’ 

నరేశ్ నటుడిగా 50 ఏళ్లను పూర్తిచేసుకున్నాడు. అలాగే విజయనిర్మల విజయకృష్ణా మూవీస్ బ్యానర్ ను స్థాపించి కూడా 50 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ బ్యానర్ పై నరేశ్ ఒక సినిమాను నిర్మించాడు. ఆ సినిమా పేరే ‘మళ్లీ పెళ్లి’.  నిజానికి నరేశ్ తెరపై కథానాయకుడిగా కనిపించి చాలాకాలమే అయింది. చాలా డిమాండ్ ఉన్న కేరక్టర్ ఆర్టిస్టులలో ఇప్పుడు ఆయన ఒకరు. అలాగే టాలీవుడ్ లోని సినిమా శ్రీమంతులలో ఆయన ఒకరు. అలాంటి ఆయనకి హీరోగా ఒక సొంత సినిమా చేసుకోవడమనేది పెద్ద విషయం కాదు.

అయితే ఇప్పుడు నరేశ్ హీరోగా చేస్తే చూసేదెవరు? అనే ఒక సందేహం చాలామందికి కలగడం సహజం. కానీ ఆయన చేసిన ‘మళ్లీ పెళ్లి’ విషయంలో జనాలు అలా అనుకోలేదు. అందుకు కారణం ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా పవిత్ర లోకేశ్ నటించడం .. ఈ సినిమాకి ముందు వారిద్దరూ వార్తలలోని వ్యక్తులు కావడం. వారి వైవాహిక జీవితానికి సంబంధించిన కథనాలు షికారు చేయడం. దాంతో సహజంగానే ఈ సినిమాపై అందరిలో కాకపోయినా, కొందరిలోనైనా ఆసక్తి పెరుగుతూ పోయింది.

ఇక నరేశ్ హీరోగా మరోసారి తన ముచ్చట తీర్చుకోవడానికి ఈ సినిమాను చేశాడా? లేదంటే ఇటీవల తన ఫ్యామిలీకి సంబంధించిన గొడవలపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాడా? అనేది జనాలకు అర్థం కాలేదు. ఈ నేపథ్యంలోనే నిన్న థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఇది బయటి కథ కాదు .. నరేశ్ ఇంట్లో నుంచి వచ్చిన కథ అనే విషయం ఫస్టు సీన్ లోనే జనాలకు అర్థమైపోతుంది. సినిమా మొత్తంలో నరేశ్ తన విషయానికి సంబంధించిన క్లారిటీని తనవైపు నుంచి ఇచ్చుకున్నాడు. ఇక ఎంతవరకూ నమ్మాలనేది ఆడియన్స్ ఛాయిస్. ఒక రెగ్యులర్ సినిమాగానే భావిస్తే మాత్రం, ఓ మాదిరిగా ఉందని చెప్పుకోవాలంతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular