Sunday, June 14, 2026
Homeసినిమాఎస్పీ బాలుకి ఫిలిం, టివి డైరెక్టరీ అంకితం

ఎస్పీ బాలుకి ఫిలిం, టివి డైరెక్టరీ అంకితం

వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు ఫిల్మ్, టీవీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులతో పాటు వెండితెర అవార్డులు అందిస్తోంది. వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదికి సంబంధించిన సినిమా తారల డైరీని రూపొందించారు. ఈ డైరీని గానగంధర్వ, పద్మవిభూషణ్ ఎస్ పి బాలసుబ్రమణ్యంకు అంకితమిచ్చారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. మా అధ్యక్షులు వి కె నరేష్ డైరీని లాంచ్ చేసి నటుడు శివ బాలాజికి, విష్ణు బొప్పన కి అందజేశారు.  త్వరలో జరగబోయే వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ బుల్లితెర అవార్డుల బిగ్ పోస్టర్ ను ఆవిష్కరించారు. గత ఏడేళ్లుగా వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత విష్ణు  బొప్పన డైరీ, బుల్లితెర అవార్డులు, వెండితెర అవార్డులు, పేద సినీ, టివి కళాకారులని ఆదుకోవటంలో గానీ, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆపకుండా చేస్తున్నారు. ఆయనకు సహకరిస్తున్నందుకు వాళ్ళ స్పాన్సర్స్ కి  నా ధన్యవాదాలు అన్నారు.

నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ “ఇన్నికార్యక్రమాలను నిర్వహిస్తూ ఇంకా ఏదో చేయాలాని తపన పడుతున్న విష్ణు  బొప్పన గారికి  ఆయనకు సహకరిస్తున ప్రతి ఒక్కరికి మంచి జరిగి ఇంకొంత మందికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించాలని కోరుకొంటున్నాను” అన్నారు.

వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన మాట్లాడుతూ…నాతో ఇలాంటి కార్యక్రమాలను చేయిస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న నా స్పాన్సర్ల కు శ్రేయోభిలాషులకు పాదాభివందనం. ఇంకొన్ని సామజిక కార్యక్రమాలను ప్లాన్ చేశాను. నన్ను ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నా” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular