Friday, November 22, 2024
HomeTrending NewsNATO: స్వీడన్ చేరికకు నాటో కూటమి గ్రీన్ సిగ్నల్

NATO: స్వీడన్ చేరికకు నాటో కూటమి గ్రీన్ సిగ్నల్

అత్యంత కీలకమైన నాటో కూటమిలో 32వ సభ్య దేశంగా అడుగుపెట్టడానికి స్వీడన్‌కు మార్గం సుగమమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తటస్థంగా ఉంటూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు రష్యా వ్యతిరేక బృందంలో చేరనుంది. విల్నియస్‌ (లిథువేనియా) జరుగుతున్న అత్యంత కీలకమైన నాటో కూటమి సమావేశాల్లో 32వ సభ్య దేశంగా అడుగుపెట్టడానికి స్వీడన్‌కు మార్గం సుగమమైంది.

నాటోలో స్వీడన్‌ చేరికను ఆమోదిస్తే తాము టర్కీకి ఎఫ్‌ 16 విమానాలను విక్రయించేందుకు సిద్ధమే అని అమెరికా గతంలో సందేశం పంపింది. విలినస్‌కు బయలుదేరిన జో బైడెన్‌ సోమవారం ఎర్డోవాన్‌తో గంటసేపు ఈ దిశగా సంభాషించి సమస్యను కొలిక్కి తెచ్చారు. మరో సభ్య దేశం హంగరీని కూడా బైడేన్ అంగీకరింప చేశారు.  గ్రీసు పట్ల శతృత్వం, రష్యా నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు టర్కీ నిర్ణయించిననందున ఎఫ్‌-16 విమానాలను విక్రయించకూడదని గతంలో అమెరికా నిర్ణయించింది. ఇప్పుడు ఒక అడుగు దిగివచ్చినట్లు కనిపిస్తోంది. స్వీడన్‌ చేరికకు మద్దతు ఇస్తే టర్కీకి విమానాలు విక్రయించేందుకు అమెరికా పార్లమెంటు ఆమోదించవచ్చని వార్తలు వచ్చాయి. వాటిని తమకు వ్యతిరేకంగా వినియోగించరాదని గ్రీసు డిమాండ్‌ చేస్తోంది.

మరోవైపు ఉక్రెయిన్ కు నాటో కూటమిలో సబ్యత్వానికి మరికొంత సమయం ఉందని నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ చెప్పాడు. ఉక్రెయిన్ కు సభ్యత్వం ఇవ్వటం ద్వారా ప్రపంచం యుద్ధం దిశగా అడుగులు వేసినట్టే అని సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే రష్యాతో పోరులో ఉక్రెయిన్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామని నాటో కూటమి భరోసా ఇచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్