Saturday, June 13, 2026
HomeTrending Newsఆస్కార్ నామినేషన్ కు ‘నాటు నాటు’

ఆస్కార్ నామినేషన్ కు ‘నాటు నాటు’

ఆర్ ఆర్ ఆర్ సినిమా మరో చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇటీవలే 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైన ఈ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డుల ఫైనల్ నామినేషన్స్ కు కూడా ఎంపికైంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు విభాగంలో ఆర్ ఆర్ ఆర్ నామినేట్ కాకపోవడం కొంత నిరుత్సాహాన్ని కలిగించింది.

‘నాటు నాటు’ పాటతో పాటు మరో మూడు నామినేట్ అయ్యాయి. ఫైనల్ విజేత వివరాలు మరికొన్ని గంటల్లో తెలుస్తుంది.

నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ కావడంపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో సందేశాలు పంపారు. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్, సినిమాలో నటించిన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular