Sunday, January 19, 2025
Homeసినిమాక‌న్నుల పండుగ‌లా ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ పాట

క‌న్నుల పండుగ‌లా ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ పాట

Natu Song In RRR Released Ram Charan Ntr Dance 

ఆర్ఆర్ఆర్.. నుంచి నాటు నాటు అంటూ సాగే పాట కోసం సినీ అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురు చూశారు. ఆఖ‌రికి నాటు నాటు పాట వ‌చ్చేసింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ గా, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా న‌టిస్తున్న ఆర్ఆర్ఆర్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్ లో స్పీడు పెంచింది. ఈ సినిమాలోని రెండో పాటైన నాటు నాటు.. లిరికల్‌ వీడియోను సోష‌ల్ మీడియాలో విడుదల చేశారు.

‘నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు…’ అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ స్టెప్పులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ గీతానికి కీరవాణి స్వరాలు అందించగా, చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఆలపించారు. ఇప్పటికే విడుదలైన తొలి గీతం దోస్తీకి విశేష స్పందన లభించింది. నాటు నాటు సాంగ్ కు కూడా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తుంది. బెస్ట్ డ్యాన్సర్స్ అయిన తార‌క్, చ‌ర‌ణ్ పోటీప‌డి డ్యాన్స్ చేస్తుంటే.. క‌న్నుల పండ‌గ‌లా ఉంది.

Also Read : ఆర్ఆర్ఆర్ సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది

Also Read : ఆర్ఆర్ఆర్.. అంతకు మించి..

RELATED ARTICLES

Most Popular

న్యూస్