Thursday, April 18, 2024
Homeసినిమాయూట్యూబ్ ని షేక్ చేస్తోన్న‌ నాటు నాటు

యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న‌ నాటు నాటు

Natu Views: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల‌మల్టీస్టారర్ గా తెరకెక్కిన అద్భుత‌మైన చిత్రం ఆర్ఆర్ఆర్. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా మార్చి 25 న  విడుదలై 1000 కోట్లు రాబట్టిన సంగతి తెల్సిందే. ఇక ఈ చిత్రంలో చరణ్, తారక్ డ్యాన్స్ తో అదరగొట్టిన నాటు నాటు సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక తాజాగా ఈ నాటు నాటు వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ లో ఎన్టీఆర్, చరణ్ ల డ్యాన్స్ ను చూస్తూ ప్రేక్షకులు మైమర్చిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇద్దరు స్టార్ హీరోలు అలా డ్యాన్స్ చేస్తుంటే.. చూడడానికి రెండు కళ్లు చాలడం లేదంటున్నారు అభిమానులు. ఈ సాంగ్ కోసం మేము పడ్డ కష్టం అంతా ఇంతా కాదని చరణ్, తారక్ ఇంటర్ వ్యూలో చెప్పిన విషయం తెల్సిందే. ఈ సాంగ్ చూస్తుంటే.. వారు చెప్పినదాంట్లో ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ ప్రస్తుతం రికార్డు వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇలా రిలీజ్ చేసారో లేదో.. అలా మిలియ‌న్ వ్యూస్ తో దూసుకెళుతోంది. మరి ఈ సాంగ్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్