Sunday, January 19, 2025
HomeసినిమాNani: నాని స్పీడు మామూలుగా లేదుగా..

Nani: నాని స్పీడు మామూలుగా లేదుగా..

తక్కువ టైమ్ లో ఎక్కువ సినిమాలు చేసే హీరో అంటే ఠక్కున రవితేజ పేరు చెబుతారు. సంవత్సరంలో రెండు సినిమాలు రిలీజ్ చేస్తుంటాడు. మరో సినిమాని సెట్స్ పై ఉండేట్టు చూసుకుంటాడు. కథ నచ్చిందంటే చాలు చాలా ఫాస్ట్ గా సినిమా పూర్తయ్యేలా డేట్స్ ఇస్తుంటాడు. ఇప్పటి వరకు అలాగనే చేశాడు.. చేస్తున్నాడు కూడా. అయితే.. ఇప్పుడు రవితేజను మించిపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. అవును.. నాని కూడా తన సినిమాల విషయంలో స్పీడు పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళుతున్నాడు.

దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఈ సినిమా తర్వాత నాని నటించిన సినిమా హాయ్ నాన్న. ఈ ఇయర్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా మూడు నెలల టైమ్ ఉంది. ఈలోపే ‘హాయ్ నాన్న’ సినిమాను పూర్తి చేశాడు. ఈ చిత్రానికి శౌర్యవ్ దర్శకత్వం వహించారు. నానికి జంటగా మృణాల్ ఠాగూర్ నటించింది. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఈ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు నాని ఓకే చెప్పారు.  ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా తర్వాత డిసెంబర్ నుంచి తమిళ దర్శకుడు సి.బి. చక్రవర్తితో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలు కాకుండా మరో రెండు సినిమాలు ఓకే చేశాడట. ఈ సినిమా గురించి కూడా త్వరలో ప్రకటించనున్నారని సమాచారం. మరి.. రవితేజ, నాని బాటలో మిగిలిన హీరోలు కూడా ఎక్కువ సినిమాలు చేస్తే బాగుంటుంది అని టాక్ వినిపిస్తోంది.

Also Read: December Release: వరుణ్, నానితో పోటీకి సై అంటున్న నితిన్..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్