Saturday, January 18, 2025
Homeసినిమానాకొచ్చిన హిందీ సరిపోదు : నాని

నాకొచ్చిన హిందీ సరిపోదు : నాని

బాహుబలి తరువాత అందరి దృష్టి పాన్ ఇండియా సినిమాల వైపే. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్.. ఇలా ఏ వుడ్ అయినా పాన్ ఇండియా వైపే చూస్తుంది. ఇప్పుడు నార్త్ లో కంటే సౌత్ లోనే పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ నిర్మాణంలో ఉన్నాయి. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ పాన్ ఇండియా మూవీ చేయాలి అనుకుంటున్నారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ అనే పాన్ ఇండియా మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.

ఇక యువ సమ్రాట్ నాగచైతన్య అమీర్ ఖాన్ తో కలిసి నటిస్తున్న లాల్ సింగ్ చడ్హా సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో నాగచైతన్య త్వరలో పాల్గొంటారని సమాచారం. ఇలా టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక నేచురల్ స్టార్ నానిని బాలీవుడ్ ఎంట్రీ గురించి అడిగితే.. బాలీవుడ్‌ కూడా మూవీ చేయాలని ఉంది. అయితే.. హిందీ భాష రాకపోవడమే బాలీవుడ్‌ ఎంట్రీకి అడ్డంకిగా మారిందట. నేను హిందీ మాట్లాడగలను కానీ, బాలీవుడ్ సినిమా చేసేందుకు నాకొచ్చిన హిందీ సరిపోదు అంటున్నారు.

హిందీ సినిమా చేయాలంటే కథ నాకు బాగా నచ్చి, ఆ పాత్ర కోసం కష్టపడి హిందీ పై పట్టు సాధించాలని నాకు అనిపించాలి. నాని బాలీవుడ్‌కి కొత్త అనే ఫీలింగ్‌ ప్రేక్షకులకు రాకుడదు. అలాంటి ప్రాజెక్ట్‌ వస్తే ఖచ్చితంగా బాలీవుడ్‌ సినిమా చేస్తా అని తన మనసులోని మాటను బయటపెట్టాడు నాని. మరి.. నాని అనుకున్న విధంగా కథ సెట్ అవుతుందని.. త్వరలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తాడని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్