Saturday, July 27, 2024
Homeసినిమా‘హాయ్ నాన్న’ ఫస్ట్ లుక్

‘హాయ్ నాన్న’ ఫస్ట్ లుక్

నాని ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా చిత్రానికి  కోర్ పాయింట్‌ గా తండ్రీ-కూతురు భావోద్వేగాలతో కూడిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్నారు. నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ముందుగా చెప్పినట్లు ఈ రోజు మేకర్స్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను విడుదల చేశారు.

ఈ చిత్రానికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ‘హాయ్ నాన్న’ అనే ప్లజంట్ టైటిల్‌ను పెట్టారు. హిందీలో ‘హాయ్ పాపా’ అనే టైటిల్‌ను లాక్ చేశారు. ఫస్ట్‌ లుక్ పోస్టర్ టైటిల్ లానే ప్లజంట్ గా వుంది .నాని భుజాలపై కూర్చున్న పాప,  వెనుక నిలబడిన మృణాల్‌కి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. నాని, మృణాల్ ఇద్దరూ చేతిలో మొబైల్ ఫోన్లు పట్టుకుని కనిపిస్తున్నారు. నాని బిజీబిజీగా కనిపిస్తుండగా, మృణాల్ తన ముఖంపై అందమైన చిరునవ్వుతో ముద్దును క్యాచ్ చేస్తూ కనిపించారు. నాని లిటిల్ ప్రిన్సెస్ లుక్స్ చాలా అందంగా వుంది. క్యాజువల్ డ్రెస్సింగ్ లో గిరజాల జుట్టు, లేత గడ్డంతో క్లాసీ లుక్‌లో కనిపించారు నాని. బటన్-డౌన్ మ్యాక్సీ డ్రెస్‌లో మృణాల్ అందంగా కనిపించింది. నాని, మృణాల్ చూడముచ్చటగా ఉన్నారు.

నూతన దర్శకుడు శౌర్యువ్ చిన్న గ్లింప్స్ తో మనల్ని భావోద్వేగానికి గురిచేశాడు. హేషామ్ అబ్దుల్ వహాబ్ మనసుని కదిలించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఎమోషన్‌ జోడించారు. సాను జాన్ వరుగీస్ ISC మాస్టర్ వర్క్ విజువల్స్‌లో కనిపిస్తుంది. ఓవరాల్ గా టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తండ్రీకూతుళ్ల భావోద్వేగానికి భాష అడ్డంకి కాదు. సినిమా అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది.

వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా, కోటి పరుచూరి సిఒఒగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. యూనిక్ స్టొరీ లైన్ తో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్