Sunday, January 19, 2025
Homeసినిమానవదీప్  ‘లవ్ మౌళి’ ఫస్ట్ లుక్ విడుదల

నవదీప్  ‘లవ్ మౌళి’ ఫస్ట్ లుక్ విడుదల

Love Mouli: నైరా క్రియేషన్స్ బ్యానర్ పై అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ మౌళి’. ఈ చిత్రంలో నవదీప్, ఫంకూరీ గిద్వానీ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం తన గెటప్ పూర్తిగా మార్చుకున్నాడు నవదీప్. ఈ సినిమాతో నవదీప్ 2.0 గా క‌నిపించనున్నారు. జనవరి 26న ఆయన పుట్టిన రోజు సందర్భంగా లవ్ మౌళి సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది.

ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా అవనీంద్ర చూసుకుంటున్నారు. ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. చాలా గ్యాప్ త‌ర్వాత సినిమా చేస్తున్న న‌వ‌దీప్ ఈ సినిమాతో ఎంత వ‌ర‌కు మెప్పిస్తాడో చూడాలి.

Also Read : ‘రాధే శ్యామ్’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ నిజ‌మేనా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్