Sunday, June 14, 2026
Homeసినిమా'అనగనగా ఒక రాజు'గా నవీన్ పోలిశెట్టి! 

‘అనగనగా ఒక రాజు’గా నవీన్ పోలిశెట్టి! 

Anaganaga Oka Raju: రాజేంద్ర ప్రసాద్ .. అల్లరి నరేశ్ తరువాత ఆ తరహా కామెడీ కథలు చేయడానికి నవీన్ పోలిశెట్టి ఆసక్తిని చూపుతున్నాడు. గతంలో ఆయన నుంచి వచ్చిన ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల ఆయన నుంచి వచ్చిన ‘జాతిరత్నాలు’ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక త్వరలో ఆయన మరో హాస్యభరితమైన కథతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్ ను ఖరారు చేసి .. టైటిల్ పోస్టర్ ను వదిలారు. పొలం గట్లపై .. పంచెకట్టుతో ‘స్కూటర్ బోర్డు’పై నవీన్ షికారు చేస్తున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.

ఇక ఇదే సమయంలో ఈ సినిమా నుంచి టీజర్ ను కూడా వదిలారు. తను చాలా రిచ్ .. బంగారు ఉంగరాలు బరువెక్కువైపోయి వ్రేళ్లనుంచి జారిపోయి కిందపడిపోతున్నా, అవసరమైతే కొత్తదైనా చేయించుకుంటాను గానీ .. కిందపడిన దానిని మాత్రం తీసుకోను అనే టైపు. తాను ఏం చేసినా అది ఒక రేంజ్ లో ఉంటుందనే బిల్డప్ ఇచ్చే డైలాగ్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. కామెడీ కోసమే అయినా .. చిన్నపాటి ఏకపాత్రాభినయంలా ఈ టీజర్ సాగింది. మంచి టైమింగ్ తో నవీన్ పోలిశెట్టి ఆకట్టుకున్నాడు.

నాగవంశీకి చెందిన సితార .. త్రివిక్రమ్ కి చెందిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో కల్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్ చాలా క్యాచీగా ఉంది. నవీన్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. గొప్పలు చెప్పుకుంటూ బిల్డప్ ఇచ్చే పాత్రలో ఆయన కనిపించనున్నాడనే విషయం మాత్రం అర్థమవుతుంది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి

Also Read : పెళ్లంటే…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular