28 C
New York
Thursday, October 5, 2023

Buy now

Homeసినిమాసినిమాలో అనుష్క రచ్చ రచ్చ చేసింది - నవీన్ పొలిశెట్టి

సినిమాలో అనుష్క రచ్చ రచ్చ చేసింది – నవీన్ పొలిశెట్టి

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సెప్టెంబర్ 7న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి అభిమానులు, ఆడియెన్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆడియెన్స్ నుంచి నుంచి సుబ్బు, చరణ్, తులసి, శృతి, మీడియా ఫ్రెండ్స్ నుంచి ఐడియల్ బ్రెయిన్ జీవి చేతుల మీదుగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ… హ్యూమన్ రిలేషన్స్ మీద మంచి ఎంటర్ టైనింగ్ స్టోరీ రాసుకున్నాడు మహేశ్. జాతి రత్నాలు హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే ఒత్తిడికి గురయ్యాను. ఫైర్ యాక్సిడెంట్ లో గాయాలైన ఒక మహిళా అభిమాని డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు నా జాతి రత్నాలు సినిమా రోజూ చూస్తానని చెప్పింది. ఇంత కంటే ఓ నటుడిగా నాకేం కావాలి. ఎన్ని బాక్సాఫీస్ హిట్స్ వచ్చినా, ఎన్ని రికార్డులు సాధించినా ఇంత కంటే సంతృప్తి నటుడిగా నాకు దొరకదు. అలా ఆ సినిమాతో మీరు నా పై చూపించిన అభిమానం ఎంతో కదిలించింది. మిమ్మల్ని ఎలా ఎంటర్ టైన్ చేయాలి. ఇంకా ఎలాంటి కొత్త సబ్జెక్ట్ తీసుకోవాలి అని ఆలోచించాను. కొత్త తరహా సినిమాలు ఇష్టపడే మీకు ది బెస్ట్ మూవీ ఇవ్వాలని చాలా కథలు విన్నాను.

ఆ క్రమంలో మహేశ్ చెప్పిన ఈ స్టోరి చాలా ఎగ్జైట్ చేసింది. ఇలాంటి సబ్జెక్ట్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే తప్పకుండా నచ్చుతుందనే ధైర్యం కలిగింది. స్టాండప్ కామెడీ క్యారెక్టర్ తో ఫుల్ లెంగ్త్ సినిమా తెలుగులో రాలేదు. నిజంగానే స్టాండప్ కామెడీ షోస్ కండెక్ట్ చేసి రియల్ ఆడియెన్స్ తో మా సినిమాలో సీన్స్ షూట్ చేశాం. నేను కూడా మరే సినిమా ఒప్పుకోకుండా పూర్తిగా ఈ మూవీ మీదే దృష్టి పెట్టా. రొమాంటిక్ కామెడీ మూవీస్ తో పోల్చితే మా సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంది. అనుష్క హీరోయిన్ అనగానే హ్యాపీగా ఫీలయ్యా. ఆమెతో నా కాంబినేషన్ బాగుంది. మా మధ్య టైమింగ్ కుదిరేందుకు ఒకట్రెండు రోజులు పట్టింది. ఆ తర్వాత చాలా ఎంజాయ్ చేస్తూ సినిమాలో నటించాం.

ట్రైలర్ లో మీరు చూసింది తక్కువే. సినిమాలో అనుష్క రచ్చ రచ్చ చేసింది. హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్ కెమిస్ట్రీ మీద రన్ అయ్యే సినిమా ఇది. గత రెండేళ్లు ఈ ప్రాజెక్ట్ మీదే మేమంతా పని చేశాం. సినిమాను అంతగా నమ్మాం. ఒక కథను మీ ముందుకు తీసుకువద్దామని నమ్మకంతో పని చేశాం. సెప్టెంబర్ 7న థియేటర్స్ లోకి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వస్తోంది. చూసి ఎంజాయ్ చేయండి. యాక్షన్ మూవీస్ చేసేందుకు కూడా నేను సిద్ధమే. అయితే ప్రేక్షకులు నన్ను వైవిధ్యమైన కథల్లో ఆదరించినంత కాలం అన్ని జానర్స్ మూవీస్ చేస్తూనే ఉంటా. ప్రభాస్ అన్నకు మా మూవీ ట్రైలర్ నచ్చింది. ప్రభాస్ అన్నకు థాంక్స్ అన్నారు.

NewsDesk
NewsDesk
'ఐ'ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

న్యూస్