Tuesday, June 16, 2026
HomeసినిమాMs. Shetty & Mr. Polishetty: అమెరికా టూర్ కు మిస్టర్ శెట్టి

Ms. Shetty & Mr. Polishetty: అమెరికా టూర్ కు మిస్టర్ శెట్టి

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’  సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. హీరో నవీన్ పోలిశెట్టి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలు  చుట్టి వచ్చారు. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యారు. మాటలు, పాటలు, సినిమా విశేషాలతో ఆడియెన్స్ కు సినిమా పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

ప్రమోషనల్ టూర్ కోసం ప్రస్తుతం అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు నవీన్ పోలిశెట్టి.  అక్కడ  బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. డల్లాస్ లో ఈ నెల 6వ తేదీన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” ప్రీమియర్ షోను ఆడియెన్స్ తో కలిసి చూడబోతున్నాడు. ఆ తర్వాత చికాగో, వర్జీనియా, న్యూ జెర్సీ, సియాటెల్, బే ఏరియా, అట్లాంట తదితర రాష్ట్రాల్లో నవీన్ వెళ్లనున్నాడు,

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకం పై దర్శకుడు పి.మహేశ్ బాబు రూపొందించారు. ఈ నెల 7న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రత్యాంగిర సినిమాస్ యూఎస్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular