Tuesday, June 16, 2026
Homeసినిమాఇంట్రెస్టింగ్ కంటెంట్ తో 'ఇరైవన్' .. వెయిటింగ్ లో నయన్ ఫ్యాన్స్!

ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ‘ఇరైవన్’ .. వెయిటింగ్ లో నయన్ ఫ్యాన్స్!

నయనతార నుంచి ఒక సినిమా వస్తుందంటే సహజంగానే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. నయనతార కెరియర్ లోను హిట్లతో పాటు ఫ్లాప్ లు ఉన్నాయి. అయినా ఆమె కథల ఎంపికపై అభిమానులకు నమ్మకం ఉంది. కొత్తగా అనిపించే కంటెంట్ కాకపోతే ఆమె చేయదనే అభిప్రాయంలో అభిమానులు ఉన్నారు. అందువలన ఆమె చేసిన సినిమాల్లో తప్పకుండా ఏదో ఇంట్రెస్టింగ్ మేటర్ ఉంటుందని వాళ్లంతా భావిస్తుంటారు.

ఇక నటన విషయంలో నయనతారకి వంకబెట్టవలసిన పనిలేదు. పాత్రలో నుంచి ఏ క్షణంలో కూడా ఆమె బయటికి రాదు. అందువల్లనే ఫ్లాప్ సినిమాల్లోను ఆమె నటనకి మంచి మార్కులు పడుతుంటాయి. అయితే కొంతకాలంగా ఆమె నుంచి ఆశించిన స్థాయి స్పీడ్ లో సినిమాలు రాలేదనే చెప్పాలి. అందుకు కారణం ఆమెకి డిమాండ్ తగ్గడం కాదు .. ఆమె మార్కెట్ పడిపోవడం కూడా కాదు. సరైన కథలను ఎంచుకుకోవడంలో వచ్చిన గ్యాప్ గానే చెప్పుకోవాలి.

అలాంటి నయనతార ప్రధాన పాత్రగా మరో వైవిధ్యభరితమైన సినిమా రూపొందింది .. ఆ సినిమా పేరే ‘ఇరైవన్’. అహ్మద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమెతో పాటు ‘జయం’ రవి కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనేది నయన్ అభిమానులు చెబుతున్న మాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular