Monday, March 16, 2026
Homeసినిమాగాడ్ ఫాద‌ర్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన మెగాస్టార్

గాడ్ ఫాద‌ర్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన మెగాస్టార్

Open Secret: మెగాస్టార్ చిరంజీవి సీక్రెట్ అంటూనే తన సినిమాలకు సంబంధించిన సీక్రెట్స్ బ‌య‌ట‌కు చెప్పేసి షాక్ ఇస్తుంటారు. ఆ మధ్య ఓ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో పాల్గొన్న చిరంజీవి సరదగా సినిమా గురించి మాట్లాడుతూ.. ఆచార్య టైటిల్ ని పొరపాటున బయటికి చెప్పేసి నాలుక కరుచుకున్నారు. ఇక ఇటీవల ఆచార్య ప్ర‌మోష‌న్స్ లో భాగంగా యంగ్ డైరెక్ట‌ర్స్ తో చేసిన ఇంట‌ర్ వ్యూలో బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా టైటిల్ వాల్తేరు వీర‌య్య అని బ‌య‌ట‌కు చెప్పేశారు.

ఇదిలా ఉంటే.. గాడ్ ఫాద‌ర్ మూవీలో చిరుతో కలిసి నయనతార కూడా నటిస్తోంది. ఇందులో ఈ ఇద్దరు అన్నా చెల్లెలుగా  నటిస్తున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం నిజమేనంటూ మెగాస్టార్ చిరంజీవి సంగీత దర్శకుడు తమన్ తో ఇండైరెక్ట్ గా చెప్పించి షాకిచ్చారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ ఫైన‌ల్ లో వాగ్ధేవి విజేతగా నిలిచింది. అంతే కాకుండా చిరు గాడ్ ఫాదర్ మూవీలో ఓ సెంటిమెంట్ సాంగ్ ని పాడే ఛాన్స్ ని సొంతం చేసుకుంది.

ఈ విషయాన్ని తమన్ చేత చిరంజీవి స్వయంగా ప్రకటించేలా చేశారు. గాడ్ ఫాద‌ర్ మూవీలో చిరు, నయనతార అన్నా చెల్లెలుగా నటిస్తున్నారని వీళ్లిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సాంగ్ ని వాగ్ధేవితో పాడిస్తామని తమన్ స్పష్టం చేశాడు. దీంతో చాలా రోజులుగా వినిపిస్తున్న వార్తలకు పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఈ విధంగా మెగాస్టార్ గాడ్ ఫాద‌ర్ మూవీ సీక్రెట్ ని ఇండైరెక్ట్ గా లీక్ చేశారు.

Also Read : చిరు మూవీలో నితిన్. ఇది నిజ‌మేనా..? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular