ఎన్డీయే కూటమి నేతలు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలుసుకున్నారు. ఎన్డీయే పార్టీల శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్లు లేఖను ఆయనకు అందజేస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ లు గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు.
కాసేపట్లో గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా టిడిపి అధినేత చంద్రబాబుకు అధికారికంగా ఆహ్వానం అందించనున్నారు. బాబు స్వయంగా రాజ్ భవన్ కు వెళ్లి ఈ లేఖను తీసుకొని గవర్నర్ కు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.
రేపు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా…. ఇతర మంత్రివర్గం కూడా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది.