Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ICC WC Qualifiers: అమెరికాపై నెదర్లాండ్స్ విజయం

ICC WC Qualifiers: అమెరికాపై నెదర్లాండ్స్ విజయం

ఐసిసి వరల్డ్ కప్ -2023 క్వాలిఫైర్ మ్యాచ్ ల్లో భాగంగా హరారే తకశింగ స్పోర్ట్స్ క్లబ్  వేదికగా నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో అమెరికాపై నెదర్లాండ్స్ 5 వికెట్లతో విజయం సాధించింది.  నెదర్లండ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అమెరికా బ్యాట్స్ మెన్ శాయన్ జహంగీర్-71; జెస్సీ సింగ్-38; గజానంద్ సింగ్-33 పరుగులతో రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 211 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో రియాన్ క్లెన్, బాస్ దే లేదే చెరో 2; వాన్ బీక్, ఆర్యన్ దత్, ఫ్లాయిడ్, విక్రం జిత్ సింగ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

నెదర్లాండ్స్ 17 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. నిడమానూరు తేజ-58; వెస్లీ బర్రేసి-29; మాక్స్ ఒదౌద్-26; బాస్ లేదే-4 పరుగులు చేసి అవుట్ కాగా…  కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్-67 (నాటౌట్) గా నిలిచి విజయం అందించాడు. 43.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం అందుకుంది.

స్కాట్ ఎడ్వర్డ్స్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్