Thursday, March 19, 2026
HomeసినిమాCircle: నీలకంఠ 'సర్కిల్' మోషన్ పోస్టర్ రిలీజ్

Circle: నీలకంఠ ‘సర్కిల్’ మోషన్ పోస్టర్ రిలీజ్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ నుంచి మరో ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతోంది. గతంలో ‘షో’ అనే ఫీచర్ ఫిల్మ్ తో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు అందుకున్నారు. అలాగే ‘విరోధి’, ‘షో’ చిత్రాలు ఇండియన్ పనోరమలో కూడా సెలెక్ట్ అయ్యాయి. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి ‘సర్కిల్’ అనే చిత్రంతో వస్తున్నాడు. ‘ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవులవుతారో ‘అనే ట్యాగ్ లైన్ ఆకట్టుకుంటోంది.

తాజాగా ఈ మూవీ టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఒక మోడల్ ఫోటో కెమెరా లెన్స్ తిరుగుతుండగా.. దానితో పాటు ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవులవుతారో అనే ట్యాగ్ తో ఎండ్ అవుతుందీ మోషన్ పోస్టర్. చూస్తోంటే ఇది మరోసారి నీలకంఠ తరహాలోనే సాగే వైవిధ్యమైన సినిమాగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై, నైనా , పార్థవ సత్య తదితరులు నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular