Wednesday, June 17, 2026
HomeTrending NewsAccident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళలు మృతి

Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళలు మృతి

కాకినాడ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం క్వారింగ పంచాయతీ పరిధిలోని సుబ్బరాయుని దిమ్మె కూడలిలో ప్రైవేటు బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు, వీరిని యానాం ఆసుపత్రికి తరలించారు. సీతారామపురంలోని రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు విధులు ముగించుకొని నేలపల్లి, యానాం గ్రామాలకు ఆటోలో బయలుదేరారు. ఆటోలో మొత్తం 15 మంది వరకూ ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.

బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనతో ఈ దర్ఘుటన జరగింది. ఆటో నుజ్జునుజ్జవడంతో ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆటోలో ఇద్దరి మృతదేహాల ఇరుక్కుపోగా.. స్థానికుల సాయంతో అతి కష్టం మీద బయటకు తీశారు. మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాద స్థలిని మాజీ మంత్రి కన్నబాబు, యానాం, ముమ్మిడివరం ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్‌ కుమార్‌, శ్రీనివాస్‌ అశోక్‌ పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular