Sunday, January 19, 2025
HomeTrending Newsటోక్యో ఒలింపిక్స్ లో ఇండియాకు స్వర్ణం

టోక్యో ఒలింపిక్స్ లో ఇండియాకు స్వర్ణం

టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా స్వర్ణ పతకం గెల్చుకుంది. జావెలిన్ త్రో లో ఇండియా ఆటగాడు నీరజ్ చోప్రా స్వర్ణ పతకం గెల్చుకుని అథ్లెటిక్స్ లో వందేళ్ళ తర్వాత స్వర్ణ పతకం అందించి చరిత్ర సృష్టించాడు. మన దేశ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ధరించి కోట్లాది భారతీయుల ఆశలు నెరవేర్చాడు. అత్యధికంగా 87.58 మీటర్లు విసిరి మనదేశానికి స్వర్ణం అందించాడు

మొదటి రౌండ్లో 87.03 మీటర్లు

రెండో రౌండ్లో 87.58 మీటర్లు

మూడో రౌండ్లో 76.79 మీటర్లు

నాలుగో రౌండ్లో  ఫెయిల్

ఐదో రౌండ్లో మీటర్లు ఫెయిల్

ఆరో రౌండ్లో మీటర్లు 79.83 మీటర్లు విసిరి ఇండియాకు స్వర్ణం ఖరారు చేశాడు.

2008లో షూటింగ్ లో అభినవ్ బింద్రా స్వర్ణం గెల్చుకున్నాడు. ఆ తర్వాత 13 ఏళ్ళకు మరోస్వర్ణం నీరజ్ చోప్రా ద్వారా మన దేశానికి  లభించింది. ప్రస్తుతం భారత సైన్యంలో సుబేదారుగా నీరజ్ చోప్రా పని చేస్తున్నాడు.

నీరజ్ చోప్రాకు లభించిన స్వర్ణ పతకంతో టోక్యో ఒలింపిక్స్ లో ఇండియాకు మొత్తం ఏడు పతకాలు లభించాయి, వీటిలో 1 స్వర్ణ (నీరజ్) 2 రజత (మీరాబాయి చాను, రవి కుమార్ దహియా) ; 4 కాంస్య (పి.వి. సింధు, లవ్లీనా, పురుషుల హాకీ, బజరంగ్) పతకాలు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్