Tuesday, June 9, 2026
Homeసినిమాజాక్ డేనియల్స్ గా నెల్లూరు సుదర్శన్ ఫస్ట్ లుక్

జాక్ డేనియల్స్ గా నెల్లూరు సుదర్శన్ ఫస్ట్ లుక్

వినోదంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలు రూపొందిస్తూ  తనకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ.  యంగ్, ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్‌ తో ‘లైక్ షేర్ & సబ్‌ స్క్రైబ్‘ చిత్రాన్ని  ప్రస్తుతం గాంధీ రూపొందిస్తున్నారు. సంతోష్ గత సినిమా ‘ ఏక్ మినీ కథ’ కు కథ, స్క్రీన్ ప్లే గాంధీ అందించారు. దీనితో వీరి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది.

ఈ సినిమాలో సంతోష్ శోభన్ జోడిగా ‘జాతి రత్నాలు ‘ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ ‘శ్యామ్ సింగరాయ్‌’ ని అందించిన వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇటివలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టైటిల్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హీరో, హీరోయిన్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి నెల్లూరు సుదర్శన్ ఫస్ట్ లుక్ విడుదలైయింది. బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ జాక్ డేనియల్స్ గా సుదర్శన్ ఫస్ట్ లుక్  ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

Also Read: సంతోష్ శోభన్ ‘లైక్ షేర్; సబ్‌స్క్రైబ్’ ఫస్ట్ లుక్ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular