Sunday, June 7, 2026
Homeసినిమాసెప్టెంబర్ 9న ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ విడుద‌ల‌

సెప్టెంబర్ 9న ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ విడుద‌ల‌

Very Close: యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న సినిమా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని‘. S R కళ్యాణమండపం లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారు రాణి గారు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం.. ఇందులో చాలా కొత్తగా కమర్షియల్ గా కనిపిస్తున్నారు.

ఈ మధ్యే విడుదలైన సినిమా టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు. సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular