హిమాలయ దేశం నేపాల్ వరుస భూకంపాలతో వణికిపోయింది. గురువారం రాత్రి రెండు సార్లు భూమి కంపించి. రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దేశంలోని బజురా దహకోట్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి 11.58 గంటలకు భూ కంపం వచ్చింది. దీని తీవ్రత 4.8గా నమోదయింది. మరోసారి రాత్రి 1.15 గంటలకు 5.0 తీవ్రతతో ప్రకంపణలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) వెల్లడించింది. అర్ధరాత్రివేళ రెండు సార్లు భూకంపం సంభవించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.