తొమ్మిది భావోద్వేగాలు, తొమ్మిది దృక్కోణాలు, తొమ్మిది కథలు.. వీటి సమాహారంగా ప్రముఖ డిజిటల్ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్ లో ఆగస్ట్ 6న విడుదలవుతున్నఅంథాలజీ ‘నవరస’. ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను మంగళవారం (జూలై 27) నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. భారతీయ సినిమాలో లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం, సీనియర్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర పంచపకేశన్ ఈ అంథాలజీని రూపొందించారు. మానవ జీవితంలోని తొమ్మిది రసాలు(భావోద్వేగాలు).. ప్రేమ, హాస్యం, కోపం, దుఃఖం, ధైర్యం, భయం, జుగుప్స, ఆశ్చర్యపోవడం, శాంతి కలయికతో.. తమిళ సినిమాకు సంబంధించిన అద్భుతమైన క్రియేటివ్ పర్సన్స్ అందరూ ఇండియన్ సినీ ఎంటర్టైన్మెంట్లో లార్జర్ దేన్ లైఫ్ మూమెంట్ ఈ అంథాలజీని రూపొందించారు.
అద్భుతమైన సృజనాత్మక నైపుణ్యం, ప్రతిభల కలయికతో వస్తున్న అంథాలజీ `నవరస` పాండమిక్ సమయంలో ఇబ్బందులు పడ్డ తమిళ సినిమా కార్మికుల కోసం ఆపన్న హస్తం అందించడానికి రూపొందిచబడినది. అరవింద స్వామి, బిజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్, కార్తీక్ నరేన్, ప్రియదర్శన్, రతీంద్రన్ ఆర్.ప్రసాద్, ఎస్.అర్జున్ వసంత్ ఎస్.సాయి వంటి తొమ్మిది మంది గొప్ప దర్శకులు.. ప్రతి రసానికి(భావోద్వేగం) ప్రాణం పోయడానికి కలిసి కట్టుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. జస్ట్ టికెట్స్ బ్యానర్ నిర్మాణంలో మణిరత్నం, జయేంద్ర పంచపకేశన్ సహ నిర్మాతలుగా ఈ `నవరస` అంథాలజీ రూపొందించబడింది. ఆగస్ట్ 6న నెట్‌ఫ్లిక్స్ 190 దేశాల్లో విడుదలవుతుంది.
ఈ సందర్భంగా మణిరత్నం, జయేంద్ర పంచపకేశన్ మాట్లాడుతూ… “భావోద్వేగాలు క్షణికమైనవే కావచ్చు. అయితే అవి మన జీవితాంతం గుర్తుండిపోతాయి. భావోద్వేగాలు మన జీవితంలో ఓ భాగం. కొన్ని భావోద్వేగాలు అయితే మన గమనాన్నే మార్చేస్తాయి. ఇలాంటి భావోద్వేగాలతో రూపొందిన `నవరస` మనలో ఆసక్తిని కలిగిస్తుంది. సాధారణంగా మన జీవితంలో ఎన్నో భావోద్వేగాలున్నప్పటికీ ప్రధానంగా ఓ ఎమోషన్ మన మనస్సు, ఆత్మను స్వాధీనంలోకి తెచ్చుకుని మన చర్యల ద్వారా బహిర్గతమవుతుంటాయి. అలాంటి తొమ్మిది భావోద్వేగాల నుంచి పుట్టిన తొమ్మిది కథల కలయికే `నవరస`. క్షణిక కాలంలో కొన్నిసార్లు ఇలాంటి భావోద్వేగాలు కీలకంగా వ్యవహరిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ తొమ్మిది రసాల సంగమాన్ని చూసి ఆనందిస్తారని భావిస్తున్నాం“ అన్నారు.