Thursday, March 28, 2024
Homeసినిమాఆగ‌స్ట్‌13న పూర్ణ‌ 'సుందరి'

ఆగ‌స్ట్‌13న పూర్ణ‌ ‘సుందరి’

రిజ్వాన్ ఎంట‌ర్టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం విడుద‌ల‌కి సిద్ద‌మైంది. హీరోయిన్ పూర్ణ లీడ్ రోల్‏లో నటిస్తున్న ‘సుంద‌రి` సినిమా ఆగ‌స్ట్‌13న థియేట‌ర్లలో గ్రాండ్‌గా విడుద‌ల‌ కానుంది. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్లో న‌వ‌గ్ర‌హ కుండ‌లి ముందు పూర్ణ ఇంటెన్స్ లుక్ లో క‌నిపిస్తోంది. ‘నాట‌కం’ ఫేమ్ క‌ళ్యాణ్ జీ గోగ‌న డైరెక్ష‌న్‏లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్ప‌టికే విడుదలైన ఈ మూవీ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఫ్యామిలీడ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి రిజ్వాన్ నిర్మాత‌, `ది ఆల్టిమేట్ డిసిష‌న్ ఆఫ్ ఎన్ ఇన్నోసెంట్ లేడీ` అనేది ట్యాగ్‌లైన్‌.

విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా రూపొందిన ఈ సినిమా పై టీమ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఓ కొత్త తరహా సినిమాను చూసిన ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగిస్తుంది అంటున్నారు. పూర్ణ‌, అర్జున్ అంబటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బాల్‌రెడ్డి కెమెరామేన్‌, మ‌ణికాంత్ ఎడిట‌ర్, కో- ప్రొడ్యూస‌ర్‌: ఖుషి, కె రామ్‌రెడ్డి, లైన్‌ప్రొడ్యూస‌ర్‌: శ్రీ వ‌ల్లి చైత‌న్య‌, సంగీతం: సురేష్ బొబ్బిలి, డిఒపి: బాల్‌రెడ్డి, ఎడిట‌ర్: మ‌ణికాంత్‌, నిర్మాత‌: రిజ్వాన్‌, ద‌ర్శ‌క‌త్వం: క‌ళ్యాణ్ జీ గోగ‌న.

RELATED ARTICLES

Most Popular

న్యూస్