Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్ICC Mens T20 World Cup 2022 :నమీబియాపై నెదర్లాండ్స్ విజయం

ICC Mens T20 World Cup 2022 :నమీబియాపై నెదర్లాండ్స్ విజయం

పురుషుల టి 20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు జరిగిన మొదటి గ్రూప్ మ్యాచ్ లో నమీబియాపై నెదర్లండ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

గీలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లోనమీబియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జాన్ ఫ్రైలింక్-43; ఓపెనర్ మైఖేల్ వాన్-20; బార్డ్-19 పరుగులతో రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.

ఈ లక్ష్యాన్ని నెదర్లాండ్స్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి సాదించింది. ఓపెనర్లు మాక్స్ ఓ దౌడ్- 35; విక్రమ్ జిత్ సింగ్- 39; బాస్ దే లీడ్ -30 పరుగులతో సత్తా చాటారు.

రెండు వికెట్లతో పాటు, రెండు క్యాచ్ లు పట్టి, ఇటు బ్యాటింగ్ లో 30పరుగులతో నాటౌట్ గా నిలిచినా బాస్ దే లీడ్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : T20 World Cup: బుమ్రా స్థానంలో షమీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్