Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్జూనియర్ హాకీ: ఫైనల్లో నెదర్లాండ్స్ వర్సెస్ జర్మనీ

జూనియర్ హాకీ: ఫైనల్లో నెదర్లాండ్స్ వర్సెస్ జర్మనీ

#JWC2021: హాకీ ఉమెన్స్ జూనియర్ వరల్డ్ కప్ సెమి ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో ఇండియా 3-0 తేడాతో ఓటమి పాలైంది.  సౌతాఫ్రికా లోని పోచెఫ్ స్ట్రూమ్ లో జరిగిన నేటి మ్యాచ్ లో 12వ నిమిషం వద్ద బీట్స్ మా టేస్సా;  53, 54 నిమిషాల్లో ఫోక్కీ లూనా, డిక్కీ జీప్ లు ఫీల్డ్ గోల్స్ చేశారు. ఇండియా గోల్ చేయడంలో విఫలమైంది.

లీగ్ దశల్లో వరుస విజయాలతో సెమీ ఫైనల్స్ కు చేరుకున్న ఇండియా జూనియర్ మహిళా జట్టు  ఫైనల్స్ చేరలేకపోయింది. గతంలో మూడుసార్లు ఈ టోర్నీ విజేతగా నిలిచి, గత టోర్నమెంట్ లో రన్నరప్ గా నిలిచిన నెదర్లాండ్స్ అద్భుత పోరాట పటిమ ప్రదర్శించి ఆట మొదటి నుంచీ  పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

మరో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై జర్మనీ 8-0తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది. జర్మనీ ఐదు ఫీల్డ్ గోల్స్, మూడు పెనాల్టీ కార్నర్ గోల్స్ సాధించింది.

మూడో స్థానం కోసం ఎల్లుండి 12వ తేదీన జరిగే మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో ఇండియా తలపడనుంది. అదేరోజు నెదర్లండ్స్- జర్మనీ మధ్య ఫైనల్ పోరు జరగనుంది.

Also Read : హాకీ: ఇండియా పై నెదర్లాండ్స్ షూటౌట్ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్