Tuesday, June 16, 2026
Homeసినిమామహేష్, భూమిక హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం

మహేష్, భూమిక హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం

నూతన నటీనటులు మహేష్, భూమిక హీరో, హీరోయిన్ గా సజ్జా కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. గోల్డెన్ సినీ క్రియషన్స్ పతాకం పై ప్రొడక్షన్ నెం.1 షూటింగ్  హైదరాబాద్ గోల్డెన్ టెంపుల్ లో ప్రారంభం అయింది. ఈ చిత్రాన్ని సి.హెచ్ సుజాత నిర్మిస్తున్నారు. విభిన్న కథాంశంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత సుజాత మాట్లాడుతూ.. మా బ్యానర్  గోల్డెన్ సినీ క్రియషన్స్ లో ప్రొడక్షన్ నెం.1 చిత్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. డైరక్టర్ కుమార్ చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించాలని ఈ సినిమా చేస్తున్నాం. అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు.

డైరెక్టర్ కుమార్ మాట్లాడుతూ… నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సుజాత గారికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శోభన్ బాబు విలయిల్ పిలిప్స్ థామస్ చాల్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టుగా మంచి సినిమా తీస్తాను అన్నారు.

సీనియర్ ప్రొడ్యూసర్ రామరాజు మాట్లాడుతూ.. గోల్డెన్ సినీ క్రియషన్స్ లో వస్తున్న మొదటి సినిమా సక్సెస్ అవ్వాలి అని సుజాత గారికి దర్శకుడు కుమార్ కి మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular