Friday, April 26, 2024
Homeసినిమాశ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా సైకాలాజికల్ థ్రిల్లర్

శ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా సైకాలాజికల్ థ్రిల్లర్

కె. యస్. ఆర్ ప్రజెంట్స్, ఉదయ్ & రవి క్రియేషన్స్ పతాకంపై శ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా , హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా, కమల్ కామరాజు, అజయ్ ఇతర పాత్రల్లో డాక్టర్ రవికిరణ్ గాడలే దర్శకత్వంలో డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయ్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి కరెడ్డిలు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకున్నాయి. ఈ సినిమా ముహూర్త‌పు స‌న్నివేశానికి డైరెక్టర్ సుధీర్ వర్మ క్లాప్ కొట్టగా జార్జి రెడ్డి హీరో సందీప్ మాధవ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

డాక్టర్ రవికిరణ్ గాడలె మాట్లాడుతూ… ఈ సినిమా కథ కొత్తగా ఉండబోతొంది. ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. Post traumatic stress disorder (పోస్ట్ ట్రూమాటిక్ స్ట్రెస్ డిసార్డర్) కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సైకాలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. జనవరి 2 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ… డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోందని నమ్ముతున్నాను. డైరెక్టర్ డాక్టర్ రవికిరణ్ తీసిన ఇండిపెండెంట్ చిత్రం “థ రాంగ్ స్వైప్” చాలా బాగుంది, అలాగే ఈ చిత్ర కథ విని వెంటనే చెన్నయ్ పిలిచి కథను ఒకే చేశాను, యంగ్ టీమ్ కలిసి చేస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తా మని అన్నారు. త్వరలో ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్