Sunday, June 14, 2026
Homeసినిమావరుణ్ హీరోగా ‘పూర్ణ’ ప్రారంభం

వరుణ్ హీరోగా ‘పూర్ణ’ ప్రారంభం

వరుణ్ హీరోగా సోనాక్షి వర్మ, చైతన్య ప్రియ హీరోయిన్స్ గా యంఆర్డీ ప్రొడక్షన్స్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ యం ఆర్ దీపక్ దర్శక,నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం పూర్ణ. లవ్ స్టోరీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న పూర్ణ చిత్రం ఆగస్ట్ 7న హైదరాబాద్ ఫిలిం నగర్ ఫిలించాంబర్లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో,హీరోయిన్స్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ నివ్వగా నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ కెమెరా ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి ప్రముఖ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్టును తెలంగాణ ఫిలింఛాంబర్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి చిత్ర యూనిట్ కి అందించారు.

 దీపక్ మాట్లాడుతూ “ప్రస్తుత సమాజంలో అమ్మాయిల పై అనేక హత్యాచారాలు జరుగుతున్నాయి. వాటి నుండి అమ్మాయిలు తమకి తాము ఎలా కాపాడుకోవాలనేది మా చిత్ర కథాంశం. పూర్ణ అనే అమ్మాయి నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథని రెడీ చేయడం జరిగింది. సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఒక చక్కని లవ్ స్టోరీ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విధంగా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పూర్ణ చిత్రాన్ని రూపొందిస్తున్నాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular