దేశంలోని వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో కొత్త గవర్నర్లను నియమించింది. ఈ మేరకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ కొత్త గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్‌ను నియమించారు. అయోధ్య కేసుతో పాటు ట్రిపుల్ తలాఖ్ కేసులు విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఉన్నారు. ఏపీ ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించారు. ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండటం, ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో కొత్త గవర్నర్‌ను నియమించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
గవర్నర్ బాధ్యతల నుంచి తప్పించాలంటూ ఇటీవల కోరిన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ స్థానంలో రమేష్ బైస్ ను కొత్త గవర్నర్‌గా నియమించింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గవర్నర్లను మార్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే కొన్నిరోజుల క్రితం తెలంగాణ గవర్నర్ తమిసైని బదిలీ చేయనున్నారనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా కేంద్రం ప్రకటించిన గవర్నర్ల జాబితాలో 12 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతం ఉండగా..ఇందులో తెలంగాణ గవర్నర్ మార్పు లేదు.
- కొత్త గవర్నర్లు వీరే..
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ కైవల్య
సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
లడఖ్ గవర్నర్‌గా బి.డి. మిశ్రా
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా త్రివిక్రమ్ పర్నాయక్
జార్కండ్ గవర్నర్‌గా రాధాకృష్ణన్
అస్సాం గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా శివప్రసాద్ శుక్లా
మణిపూర్ గవర్నర్‌గా అనసూయ
నాగాలాండ్ గవర్నర్‌గా గణేషన్
మేఘాలయ గవర్నర్‌గా చౌహాన్