Saturday, June 13, 2026
HomeTrending Newsసిఎంను కలిసిన నూతన విసిలు

సిఎంను కలిసిన నూతన విసిలు

నూతనంగా నియమితులైన పలు యూనివర్శిటీల వైస్‌ చాన్స్‌లర్‌లు తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  వీసీలుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం  కడప డాక్టర్‌ వైయస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్శిటీ వీసీ బానోత్‌ ఆంజనేయ ప్రసాద్, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ) గురజాడ, విజయనగరం వీసీ కే.వెంకట సుబ్బయ్య, ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఒంగోలు వీసీ మారెడ్డి అంజిరెడ్డిలు సిఎంతో భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో ఉన్నతవిద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కే. హేమచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular