Devon Conway Century: న్యూజిలాండ్ –బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న రెండు టెస్టుల సీరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కీవీస్ ఐదు వికెట్లకు 258 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే సెంచరీ (122) సాధించాడు. విల్ అర్ధ సెంచరీ(52) చేసి రనౌట్ అయ్యాడు.
న్యూజిలాండ్ బే ఓవల్ మైదానంలో నేడు మొదలైన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఒక పరుగు వద్దే ఓపెనర్, కెప్టెన్ టామ్ లాథమ్ (1) ఔటయ్యాడు. రెండో వికెట్ కు యంగ్, కాన్వే 138 పరుగుల భాగస్వామ్యం సాధించాడు. రాస్ టేలర్-31; వికెట్ కీపర్ టామ్ బ్లండెల్-11 పరుగులు చేసి ఔటయ్యారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి హెన్రీ నికోల్స్ 32 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో శోరిఫుల్ ఇస్లామ్ రెండు; ఈ హుస్సేన్, కెప్టెన్ మొనిముల్ హక్ చెరో వికెట్ పడగొట్టారు.