Sunday, November 10, 2024
Homeస్పోర్ట్స్NZ Vs. SL: Tim Seifert: కివీస్ దే టి 20 సిరీస్

NZ Vs. SL: Tim Seifert: కివీస్ దే టి 20 సిరీస్

శ్రీలంకతో జరిగిన టి 20 సిరీస్ ను ఆతిథ్య న్యూజిలాండ్ 2-1తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20ఓవర్లలో 182  పరుగులు చేయగా, కివీస్ మరో బంతి మిలిగి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

క్వీన్స్ టౌన్ లోని జాన్ డేవిస్ ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంక తొలి వికెట్ కు (పాథుమ్ నిశాంక 25) 76 పరుగులు చేసింది. మరో ఓపెనర్ కుశాల్ మెండీస్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 73;  కుశాల్ పెరీరా 21 బంతుల్లో  2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33; ధనంజయ డిసిల్వా 20; దాసున్ శనక 15 పరుగులు చేశారు.

కివీస్ బౌలర్లలో బెన్ లిస్టర్ 2; మిల్నే, ఇష్ సోది చెరో వికెట్ పడగొట్టారు.

లక్ష్య సాధనలో కివీస్ తొలి వికెట్ కు 53 పరుగులు చేసింది.  చాడ్ బోవ్స్ 17రన్స్ చేసి వెనుదిరగ్గా… మరో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్- కెప్టెన్ లాథమ్ లు రెండో వికెట్ కు 84 పరుగులు చేశారు. సీఫెర్ట్ 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 88; లాథమ్ 23 బంతుల్లో  1 ఫోర్; 1 సిక్సర్ తో 31 రన్స్ చేసి ఔటయ్యారు. చివరి ఓవర్లలో 10 పరుగులు అవసరం కాగా మొదటి బంతికి సిక్సర్ కొట్టిన మార్క్ కాంప్ మాన్ (16) రెండో బంతికి ఔటయ్యాడు, మూడో బంతి వైడ్ అయ్యింది, ఇదే బంతికి రన్ కోసం ప్రయత్నించి నీషమ్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే డెరిల్ మిచెల్ (15) కూడా పెవిలియన్ చేరడంతో కివీస్ శివిరంలో టెన్షన్ నెలకొంది.  నాలుగో బంతికి ఒక పరుగు లభించింది. ఐదో బంతికి రచన్ రవీంద్ర రెండు పరుగులు సాధించడంతో మరో బంతి మిగిలి ఉండగానే కివీస్ కు విజయం దక్కింది.

లంక బౌలర్లలో లాహిరు కుమార3; మహేష్ తీక్షణ, ప్రమోద్ మధుశాన్ చెరో వికెట్ పడగొట్టారు.

టిమ్ సీఫెర్ట్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ తో పాటు ‘ ప్లేయర్ అఫ్ ద సిరీస్’ కూడా లభించింది.

RELATED ARTICLES

Most Popular

మన భాష- 4

మన భాష- 3

మన భాష- 2

న్యూస్