Friday, March 20, 2026
Homeస్పోర్ట్స్ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్: కివీస్ 318/4

ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్: కివీస్ 318/4

Kiwis going on: ఇంగ్లాండ్- న్యూ జిలాండ్ మధ్య మొదలైన రెండో టెస్ట్ లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి కివీస్ నాలుగు వికెట్ల నష్టానికి 318  పరుగులు చేసింది. మిచెల్-81; బ్లండెల్-67 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాటింగ్ హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  కివీస్ సారధి కేన్ విలియమ్సన్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అతని స్థానంలో లాథమ్  కు కెప్టెన్సీ అప్పగించారు. హమీష్ రూథర్ఫర్డ్ జట్టులో చేరాడు.

84 పరుగుల వద్ద కివీస్ ఓపెనర్లు ఇద్దరి వికెట్లు కోల్పోయింది. విల్ యంగ్ 70 బంతుల్లో 9 ఫోర్లతో 47; కెప్టెన్ లాథమ్  60 బంతుల్లో 6 ఫోర్లతో 26 పరుగులు చేశారు. డెవాన్ కాన్వే- హెన్రీ  నికోలస్ లు రెండో వికెట్ కు 77 పరుగులు జోడించారు.  జట్టు స్కోరు 161 వద్ద  నికోలస్ (30); 169వద్ద కాన్వే (46) ఔటయ్యారు. ఆ తర్వాతా డెరిల్ మిచెల్- టామ్ బ్లండెల్ ఐదో వికెట్ కు 149పరుగుల అజేయ భాగస్వ్యామ్యం నెలకొల్పారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, కెప్టెన్ బెన్ స్టోక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular